ఏడాదిలోపు బీఆర్ఎస్ లో మిగిలేది 2 BHK మాత్రమే.. ట్విట్టర్ లో పోస్ట్ వైరల్
తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. పలువురు సిట్టింగ్ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్, బీజేపీ గూటికి చేరుతున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. పలువురు సిట్టింగ్ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్, బీజేపీ గూటికి చేరుతున్నారు. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఇంటర్నెట్ లో నెటిజన్లు రకరకాల పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో నెటిజన్ ఏడాదిలోపు బీఆర్ఎస్ లో 2 బీఎహ్ కే (2బీ= బాపు, బెటా, హెచ్= హరీశ్ రావు, కె= కవిత) మాత్రమే మిగులుతారని ట్వీట్ పోస్ట్ ఆసక్తిగా మారింది. నేను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని ఇటీవలే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించగా అంతలోనే బీఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి బాటలోనే మరికొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారబోతున్నారని, దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారబోతున్నదని అనే ప్రచారం వేళ ఈ ట్వీట్ ఆసక్తిగా మారింది. కాగా వంద రోజులు పూర్తిగా పాలనకే టైమ్ కేటాయించామని కానీ తమ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ ప్రతిరోజు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆ కుట్రలని తిప్పి కొట్టడంలో ఇక నా రాజకీయం ఏంటో చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి నిన్న హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఏడాదిలోపు BRS లో
— Congress for Telangana (@Congress4TS) March 18, 2024
2BHK మాత్రమే మిగులుతారు.
2B = బాపు, బెటా
H = హరీష్
K = కవిత