లైంగికదాడి కేసులో ఒకరికి మూడేళ్ల జైలు శిక్ష..

మైనర్ బాలికపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత సోమవారం తీర్పు చెప్పారు.

Update: 2024-06-10 08:27 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : మైనర్ బాలికపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2023లో సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్‌కు చెందిన కొండ రాహుల్ పట్టణానికి చెందిన తమ 10 సంవత్సరాల కూతురిపై అత్యాచారం చేయడానికి యత్నించాడని బాలిక తల్లి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అప్పటి సిరిసిల్ల పట్టణ సిఐ అనిల్ కుమార్ నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పీపీ పెంట శ్రీనివాస్ వాదించగా, కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కానిస్టేబుల్ మహేందర్, డి నరేందర్‌ను కోర్టులో 13 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితునికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధించినట్లు పట్టణ సీఐ రఘుపతి తెలిపారు.


Similar News