Disha Effect: సైన్ బోర్డు తొలగించిన అధికారులు.. ఎందుకో తెలుసా?
ఇటీవల బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ వద్ద ప్రమాదాల నివారణలో భాగంగా రోడ్డుపై తెలుగులో తప్పుడు సైన్ బోర్డు సూచిక పెట్టారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ వద్ద ప్రమాదాల నివారణలో భాగంగా రోడ్డుపై తెలుగులో తప్పుడు సైన్ బోర్డు సూచిక పెట్టారు. హిందీలో మాత్రం ‘దీరే చలీయే’ అని కరెక్ట్ రాసి.. తెలుగులో మాత్రం ‘నెమ్మదిగా వెళ్ళము’ అని రాసి ఉన్నది. దీనిపై తెలుగు భాషాభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేశారు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 8 వ తేదిన‘దిశ పేపర్’ తెలుగుకు పట్టించకు తెగులు! అనే శీర్షికతో న్యూస్ రాసి ప్రచురించింది. దీనిపై సంబంధిత అధికారులు తాజాగా స్పందించారు. దీంతో అక్కడ అధికారులు తెలుగులో తప్పుడు సైన్ ఉన్న బోర్డును తొలిగించారు. రోడ్ సేఫ్టీ లో భాగంగా ఆ సైన్ బోర్డు స్థానంలో రెండు ‘ఆరెంజ్ ట్రాఫిక్ కోన్స్’ అధికారులు పెట్టారు.