Nagarjuna Sagar : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తగ్గని కృష్ణమ్మ వరద

నాగార్జునసాగర్‌ ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు ప్రాజెక్ట్‌ పది క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.

Update: 2024-08-28 11:23 GMT

దిశ.నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌ ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు ప్రాజెక్ట్‌ పది క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన శ్రీశైలం నుండి నాగార్జునసాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టు 12 క్రష్ట్‌ గేట్లను 5అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుండి సాగర్‌ జలాశయానికి 143132 క్యూసెక్కుల వరద వస్తుండగా వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ డ్యామ్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 590 అడుగుల వద్ద నీరు నిల్వవుంది. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 312.0450 టీఎంసీల నిల్వ ఉంది. జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేపడుతూ 29,394 క్యూసెక్కులను, కుడి కాల్వ ద్వారా 9160 క్యూసెక్కులను, ఎడమ కాల్వ ద్వారా 8280 క్యూసెక్కులను, ఎస్‌ఎల్‌బిసి ద్వారా 1800 క్యూసెక్కులను, లో లెవల్‌ కెనాల్‌ ద్వారా 600 క్యూసెక్కులను, మొత్తంగా 143132 క్యూసెక్కులను వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. 

More News : Srisailam Reservoir : నిండు కుండలా శ్రీశైలం జలాశయం..​మళ్లీ గేట్ల ఎత్తివేత

Tags:    

Similar News