సింగరేణికి గుడ్ న్యూస్.. భట్టి విజ్ఞప్తికి ఒడిశా సీఎం సానుకూల స్పందన

నైని బొగ్గు గనుల తవ్వకానికి సహకరిస్తామని తెలంగాణకు ఒడిశా సీఎం స్పష్టం చేశారు.

Update: 2024-07-12 09:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నైని బొగ్గు గనుల్లో తవ్వకాలు చేపట్టడానికి సహకరించాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తిపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ సానుకూలంగా స్పందించారు. నైని బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఈ విషయంలో వెంటనే చర్యలు చేపట్టాలంటూ ఒడిశా అధికారులకు ఆ రాష్ట్ర సీఎం ఆదేశాలు జారీ చేశారు. సింగరేణికి కేటాయించిన ఒడిశా అంగుల్ జిల్లాలోని నైని కోల్ బ్లాక్ లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర అధికారుల బృందంతో ఒడిశా సీఎంను ఆ రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యారు.

సింగరేణికి నైని బొగ్గు బ్లాకుల ఆవశ్యకతను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాంఝీకి వివరించారు. 2017 లోనే సింగరేణికి నైని గనులను కేటాయించారు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయాలకు సంబంధించి గత ప్రభుత్వంలో నాటి బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని వివరించారు. నాడు అందచేసిన వినతి పత్రాలను అందజేశారు. భట్టి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మాంఝీ నైనీ బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని భూముల బదలాయింపు, విద్యుత్తు, రహదారుల సమస్యలను వెను వెంటనే పరిష్కరించాలని స్థానికంగా ఉన్నత అధికారులకు ఒడిశా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సిఎండి బలరాం నాయక్, ఇంధన శాఖ ఓఎస్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News