'ఎస్ఐ, కానిస్టేబుల్ ఫలితాలు రద్దు చేయాలి'
ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను రద్దు చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు డిమాండ్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను రద్దు చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు డిమాండ్ చేశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంతో ఈడబ్య్లూఎస్ అభ్యర్థులతో పాటు ఇతర వర్గాల వారికి అన్యాయం జరిగిందని ఆరోపించారు. అంతేకాకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గించిన ప్రభుత్వం ఈడబ్య్లూఎస్ అభ్యర్థులకు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. దీని వల్ల చాలామంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాలను రద్దు చేయాలని రామారావు డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది.