ఓబీసీ కులగణన.. రాహుల్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో 2 శాతం ఓట్లు కూడా రాని బీజేపీ బీసీని ఎలా సీఎం చేస్తుందని రాహుల్ చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అన్నారు. అధికారంలోకి వస్తే ఓబీసీ కుల గణన చేపడతామని రాహుల్ అంటున్నారని ఆయన వ్యాఖ్యలతో నవ్వొస్తుందన్నారు. దేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించిన పార్టీ కాంగ్రెస్ అయినా ఏనాడు ఓబీసీ కులగణన చేయలేదన్నారు. పార్టీ మనుగడ ప్రశ్నార్థకం కావడంతో కాంగ్రెస్ ఓబీసీల జపం చేస్తోందన్నారు. బీసీలకు రాహుల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని తర్వాతే ఓట్లు అడగాలన్నారు.