Nude Video calls :న్యూడ్ వీడియో కాల్ కలకలం..
ఓ యువతి ఓ యువకుడికి న్యూడ్ వీడియో కాల్ చేసింది.
దిశ, కామారెడ్డి రూరల్ : ఓ యువతి ఓ యువకుడికి న్యూడ్ వీడియో కాల్ చేసింది. పైగా మాట్లాడిన వీడియో కాల్ రికార్డు అయిందనీ, తనకు రూ.లక్ష ఇవ్వాలని లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకునికి రెండు రోజుల క్రితం ఢిల్లీకి చెందిన ఓ యువతి అర్ధరాత్రి న్యూడ్ వీడియో కాల్ చేసింది.
సదరు యువకుడు వీడియో కాల్ మాట్లాడాడు. తీరా నీతో మాట్లాడిన వీడియో కాల్ రికార్డు అయిందనీ, తనకు రూ.లక్ష పంపాలంటూ యువతి యువకున్ని బెదిరించింది. అనంతరం ఢిల్లీకి చెందిన కానిస్టేబుల్ను మాట్లాడుతున్నా అంటూ ఫోన్ కాల్ వచ్చింది. మీపై ఢిల్లీ పోలీస్ స్టేషనన్లో ఫిర్యాదు వచ్చిందని సదరు యువకుడిని ఫోన్లో మాట్లాడిన వ్యక్తి బెదిరించాడు. తమకు లక్ష రూపాయలు పంపాలనీ, లేకపోతే మీ పైన కేసు పెడతామంటూ ఆ యువకున్ని బెదిరించారు.
దీంతో భయాందోళన గురైన యువకుడు విడతల వారీగా రూ.60 వేలను ఆన్ లైన్ అకౌంట్ ద్వారా పంపించాడు. అనంతరం సదరు యువతిపై కేసు నమోదు చేయాలంటూ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. యువకుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి పట్టణ పోలీసులు తెలిపారు.
Also Read: బెడ్షీట్లో బిగ్ బాస్ బ్యూటి.. హాట్ వీడియో వైరల్