Rajya Sabha Election 2024: తెలంగాణలో రాజ్యసభ‌ బై పోల్‌కు నోటిఫికేషన్ రిలీజ్.. కాంగ్రెస్ అభ్యర్థి?

తెలంగాణాలోని రాజ్యసభ సీటుతో పాటు.. వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

Update: 2024-08-14 10:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణాలోని రాజ్యసభ సీటుతో పాటు.. వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నేటి నుంచి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగనున్నట్లు కమిషన్ ప్రకటించింది. అనంతరం ఈ నెల 27 వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు, సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు.. ఫలితాలు ప్రకటించనున్నారు.

కాగా, తెలంగాణలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు రాజీనామాతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. అయితే కేకే స్థానంలో సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీని అభ్యర్థిగా ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్నది. కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన హస్తిన పర్యటన తర్వాత అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News