ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల పర్వం

వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.

Update: 2024-05-09 11:09 GMT
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల పర్వం
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో:వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుంది. మే 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. మే 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూన్ 5న కౌంటింగ్ జరగనుంది. ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక్లలో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. కాగా కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ తరపున రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిలు పోటీ పడుతున్నారు.

Tags:    

Similar News