ఆ మూడు సెగ్మెంట్లలో నో సెకండ్ ర్యాంక్ లీడర్స్.. విపక్షంలో ఉన్న ఖతమే!

బీఆర్ఎస్‌లో ఆ మూడు అసెంబ్లీ సెగ్మంట్లలో సెకండ్ ర్యాంకు లీడర్లు కనిపించరు.

Update: 2023-04-26 07:03 GMT

దిశ,తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్‌లో ఆ మూడు అసెంబ్లీ సెగ్మంట్లలో సెకండ్ ర్యాంకు లీడర్లు కనిపించరు. ఒకవేళ ఎవరైన ఎదుగేందుకు ట్రై చేస్తే వారి సంగతి అంతే. వెంటనే పై నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తారనే ప్రచారం ఉంది. అందుకే మౌనంగా వారు చెప్పింది వినాలి.. ఇచ్చింది తీసుకోవాలి... దక్కిన మేరకు సంతోష పడాలి.. అనే చర్చ జరుగుతోంది. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజవర్గాల్లో రెండో శ్రేణి లీడర్లు భూతద్దం పెట్టి వెతికినా కనిపించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తర్వాత నెక్ట్స్ లీడరు ఎవరు అనే ప్రశ్నే అక్కడ తలెత్తదు. ఎందుకంటే అంతటి స్థాయి లీడరు లేకుండా చేస్తుంటారనే టాక్ ఉంది.

అక్కడ నియంతృత్వమే

సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అసెంబ్లీ సెగ్మంట్లలోని బీఆర్ఎస్ పార్టీలో నియంతృత్వం ఉంటుందని టాక్ ఉంది. నియోజకవర్గం లీడర్లు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదని విమర్శలు ఉన్నాయి. ఏ పనిచేయాలి? ఏం చేయకూడదు? పైనుంచి వచ్చే డైరక్షన్ల మేరకు నడుచుకుంటారు. ఎవరైన సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే వెంటనే ఫోన్లు చేసి, చివాట్లు పెడుతుంటారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో సెకండ్ కేడర్ ఎందుకు వచ్చిన తలనొప్పని మౌనంగా ఉంటున్నారు.

కుమలిపోతున్న సెకండ్ లీడర్లు

ఈ మూడు నియోజకవర్గాల్లోని లీడర్లు కుమిలిపోతున్నారు. తమ రాజకీయ భవిష్యత్‌కు చాన్స్ లేదా?అని ఆందోళన చెందుతున్నారు. పార్టీ పెద్దలు ఇచ్చిన పదవులు తీసుకోవడమో, లేకపోతే ఇచ్చిన పనులు చేసుకుని సంతోష పడటమో చేయాలి తప్పా రాజకీయ ఎదుగుదల లేదని మధనపడుతున్నారు. గజ్వేల్ అసెంబ్లీ సెగ్మంట్‌లోని పార్టీ లీడర్లుకు లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వరని విమర్శలు ఉన్నాయి. కష్టాసుఖాలు చెప్పుకునే వెసులుబాటు లేదని అవేదన చెందుతున్నారు.

విపక్షంలో ఉన్న ఖతమే

ఆ మూడు నియోజకవర్గాల్లో విపక్ష పార్టీలో ఉన్నా మానసికంగా ప్రశాంతంగా ఉండనివ్వరనే ప్రచారం ఉంది. బీఆర్ఎస్‌లోకి చేరేవరకు ఎదో రకంగా ఇబ్బంది పెట్డడం, చేరిన తర్వాత కనీసం పలకరించరనే విమర్శలు ఉన్నాయి. సిరిసిల్లలో కాంగ్రెస్ లీడర్‌గా కాస్త పేరు సంపాదించుకున్న రవీందర్ రావు బీఆర్ఎస్‌లోకి వచ్చిన తర్వాత ఆయన సొంత ఉనికి కోల్పోయ్యారనే ప్రచారం స్థానికంగా ఉంది. సిద్దిపేటలో ఫారూక్ హుస్సేన్ పరిస్థితి అలాగే ఉన్నట్టు చర్చ జరుగుతోంది. గజ్వేల్‌లో ఎలక్షన్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి‌తో పాటు స్థానికంగా ఉన్న మిగతా లీడర్లు కూడా మధనపడుతున్నట్టు ప్రచారం ఉంది.

Tags:    

Similar News