ఢిల్లీ BRS ఆఫీస్ కవరేజీకి వెళ్లిన మీడియాను పంపించేసిన పోలీసులు (వీడియో)

ఢిల్లీలోని నూతన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.

Update: 2023-05-04 07:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలోని నూతన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే పార్టీ‌ ఆఫీస్‌లో జరుగుతున్న కార్యక్రమాలను కవర్ చేయడానికి అక్కడికి వెళ్లిన మీడియాను అక్కడి భద్రతా సిబ్బంది బయటకు పంపించి వేశారు. ఆ సమయంలో పార్టీ ఆఫీస్‌లో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో అక్కడి భద్రత సిబ్బంది మాకు ఆర్డర్స్ రాలేదని కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియాను పంపించివేశారు. దీంతో కొంత సమయం భద్రత సిబ్బందికి కవరేజ్ చేయడానికి వచ్చిన జర్నలిస్టుల మధ్య వాగ్వాదం జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది కవరేజీకి కుదరదు అని చెప్పడంతో పార్టీ ఆఫీస్ బయట కెమెరాలు, స్టాండులతో మీడియా ప్రతినిధులు గేటు బయట నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. 

Tags:    

Similar News