Telangana: మరో 3 మెడికల్ కాలేజీలకు ఎన్‌ఎంసీ పర్మిషన్
రాష్ట్రంలో మరో 3 ప్రైవేటు మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది..
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరో 3 ప్రైవేటు మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. అరుంధతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సీఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఫాదర్ కొలంబో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో కాలేజీలో 150 సీట్ల చొప్పున అందుబాటులోకి వచ్చాయి. ఇవిగాక కామారెడ్డి, అసిఫాబాద్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలకు సైతం ఎన్‌ఎంసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటిల్లో వంద చొప్పున సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాటు మరో ఏడు కాలేజీల్లో ఎన్‌ఎంసీ తనిఖీలు పూర్తయ్యాయి. ఈ కాలేజీల్లో వంద చొప్పున సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి కూడా పర్మిషన్ వస్తే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.