దిశ, తెలంగాణ బ్యూరో: కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగాం, భూపాలపల్లి జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలను నేషనల్ మెడికల్ కమిషన్ బృందాలు సోమవారం తనిఖీ చేశాయి. కాలేజీ బిల్డింగ్, హాస్పిటల్‌లో ఉన్న సౌకర్యాలు, స్టాఫ్ ఇతర అంశాలను పరిశీలించాయి. ఈ కాలేజీలను ఎన్‌ఎంసీ టీమ్స్ తనిఖీ చేయడం ఇది రెండోసారి.
అయితే గతంలో గుర్తించిన లోపాలు ఇప్పటికీ సవరించకపోవడంపై ఎన్‌ఎంసీ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ ఫాకల్టీ కొరత, హాస్పిటల్‌లో ఎన్‌ఎంసీ రూల్స్ ప్రకారం ఉండాల్సిన వసతులు లేకపోవడం పోవడంపై కాలేజీల ప్రిన్సిపాల్స్‌ను హెచ్చరించారు. ఫైనల్ ఆడిట్‌కు వచ్చేవరకు లోపాల అన్నింటినీ సరిచేసుకోవాలని సూచించారు. లేదంటే కాలేజీలకు పర్మిషన్ వచ్చే అవకాశం ఉండదన్నారు.