విధులు బారేడు.. జీతాలు మూరెడు..

ఆ ఖాకీ చొక్కాల మాటున దాగిన ఆవేదన ఎంతో.. ఆ దయనీయ గుండెల్లో ఇంకిపోయిన కన్నీళ్లు ఎన్నో..

Update: 2024-07-21 11:05 GMT

దిశ, తాడ్వాయి : ఆ ఖాకీ చొక్కాల మాటున దాగిన ఆవేదన ఎంతో.. ఆ దయనీయ గుండెల్లో ఇంకిపోయిన కన్నీళ్లు ఎన్నో.. ఆ చూపుల వెనుక దాగి ఉన్న ఎదురుచూపులు ఇంకెన్నో.. పోలీసులతో సమానంగా పని చేస్తారు, కానీ ఆ స్థాయి జీతాలు మాత్రం అందుకోరు. ఖాకీ చొక్కా వేసుకుని శాంతిభద్రతల పరిరక్షణ కోసం హహర్నిశలు పాటు పడతారు. కానీ వారి సంక్షేమాన్ని ఎవరూ పట్టించుకోరు. ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు ఎంతో కస్టపడి విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్ ల కష్టాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్రుష్టికి తీసుకెళ్లేనా... వారి కోరికలు ఇప్పట్లో నెరవేరానా..?

విధులు బారేడు.. జీతాలు మూరేడు..

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా హోమ్ గార్డులు సుమారుగా 250 మంది ఉన్నారు. వీరందరు రోజు వారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎండనక... వాననక విధులు నిర్వర్తిస్తున్న హోం గార్డులను ప్రభుత్వం మాత్రం కేటాయించిన గంటల కంటే ఎక్కువ పని చేస్తున్న స్పందించడం లేదు. దశబ్దాల తరబడి పోలీస్ శాఖకు కానిస్టేబుల్ లతో సమాన స్థాయిలో సేవలు అందిస్తున్న హోమ్ గార్డ్ లకు చాలిచాలని వేతనాలతో దుర్భర జీవితం గడుపుతున్నామని ఆవేదన వెల్లగక్కుతున్నారు. పోలీసులైనా నెలలో సెలవు తీసుకునే వెలుసుబాటు ఉంటుంది. కానీ హోం గార్డులకు సెలవు అనే మాటే ఉండదు. ఉన్నతాధికారులు దయతలిస్తే తప్ప సెలవు మంజూరు కాదు. మానసికంగా, శారీరంగా పనిలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న హోంగార్డులు ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో హోంగార్డ్ ల పరిస్థితి దయనీయంగా మరింది.

హోమ్ గార్డ్ ల ప్రధాన డిమాండ్ లపై సీఎం రేవంత్ రెడ్డి దయతలిచేనా..

గత ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మాజీ ముఖ్యమంత్రి పలు వేదికల పై హామీలు ఇచ్చిన అవి ఇప్పటికీ వరకు అమలు కాలేదని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అమ్మ పెట్టదు.. అడుక్క తిననీయదు అన్న చందన హోం గాడ్ ల పరిస్థితి దయనీయంగా మారింది. కొత్తగా ప్రభుత్వంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యల పై సానుకూలంగా స్పందిస్తారో లేదో అని ఆశగా హోంగార్డులు ఎదురుచూస్తున్నారు.

దశబ్దల తరబడి పోలీస్ శాఖకు కానిస్టేబుల్ స్థాయిలో సమాన సేవాలందిస్తున్న హోం గార్డులను గుర్తించి వారిని శాశ్వత ప్రతిపదికంగా చేపట్టాలని కోరుతున్నారు. సర్వీస్ కాలంలో మృతి చెందిన కుటుంబాలకు కారుణ్య నియామక అవకాశం కల్పించాలన్నారు. అనారోగ్యంకు గురైన వైద్యపరీక్షలు చేయించుకునేందుకు హెల్త్ కార్డులు ఇవ్వాలని అన్నారు. కానిస్టేబుల్ రిటైర్మెంట్ సమయంలో ఏవైతే బెనిఫిట్ ఇస్తున్నారో అలాంటి బెనిఫిట్ హోం గార్డ్ లకు వర్తింపాజెయ్యాలని అన్నారు.

విధుల్లో చేరినప్పటి నుంచి రిటైర్మెంట్ అయ్యే కాలంలో రిక్రూట్మెంట్ బెనిఫిట్ లేకపోవడంతో పదవి విరమణ అయ్యే సమయానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుంటున్నామని అన్నారు. తాము స్వచ్ఛంద సేవకులం కాదని.. కష్టపడి పనిచేసే ఉద్యోగులమని గొంతులు చించుకుని అరుస్తున్నా మా ఆకలి కేకలు ఎవరికీ వినపడడం లేదని ఆవేదన చెందుతున్న హోం గార్డ్ లు మా సమస్యలు పరిష్కరించాలని సానుకూలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తారెమో అని ఆశగా హోం గార్డులు ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News