ప్రతి రైతును ఆదుకుంటాం పంటకు నష్టపరిహారం చెల్లిస్తాం.. జుక్కల్ ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజిద్ నగర్ గ్రామంలో అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్యానల్ స్పీకర్ బిచ్కుంద పరామర్శించారు.
దిశ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజిద్ నగర్ గ్రామంలో అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్యానల్ స్పీకర్ బిచ్కుంద పరామర్శించారు. మండలంలోని వాజీద్ నగర్ గ్రామంలో మొలకెత్తిన వరి ధాన్యాన్ని వారు పరిశీలించి రైతులకు అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున తప్పకుండా ప్రతి రైతుకు సహాయం అందజేస్తామని రైతులను భరోసా కల్పించారు. మొలకెత్తిన ధాన్యాన్ని చూసి వారు చెలించిపోయారు.
ఆరు నెలల కష్టం వృధా అయిందని రైతులు తీవ్రంగా నష్టపోయారని వారు వాపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కంటి పాపల కాపాడుకుంటుందని వారు అన్నారు. ఎమ్మెల్యే తో పాటు ఎంపీపీ అశోక్ పటేల్, జడ్పీటీసీ నల్చర్ రాజు, శ్రీహరి పుల్కల్ సహకార సంఘం అధ్యక్షులు ఎం రామిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్, స్థానిక సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ బండకింది సాయిలు, గ్రామ పార్టీ అధ్యక్షులు సంతోష్ మల్లు పటేల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లికార్జున్ పటేల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంగారం, గుండె నెమలి సర్పంచ్ కృష్ణారెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు.