ఉద్యమంలో పనిచేసిన కళాకారులను ఆదుకుంటాం

నిజామాబాద్ జిల్లాలో ఉద్యమంలో పనిచేసిన కళాకారులను ఆదుకుంటామని ప్రొఫెసర్ కోదండ రామ్​ అన్నారు.

Update: 2023-12-19 10:05 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లాలో ఉద్యమంలో పనిచేసిన కళాకారులను ఆదుకుంటామని ప్రొఫెసర్ కోదండ రామ్​ అన్నారు. మంగళవారం న్యూ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన నేషనల్ పెన్షనర్స్ డే కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ఉద్యమ ప్రముఖ కళాకారులు నేర్నాల కిషోర్ విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ధూంధాంలలో కష్టపడి పని చేసిన నిజామాబాద్ జిల్లాలో అర్హులైన కళాకారులకు న్యాయం చేసి ఉద్యోగాలు కల్పించాలని ప్రొఫెసర్ కోదండరాం కు తెలంగాణ ఉద్యమ కళాకారుల జిల్లా అధ్యక్షులు అష్ట గంగాధర్, ప్రధాన కార్యదర్శి కర్క రమేష్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.

    తెలంగాణ మలిదశ ఉద్యమంలో కుటుంబాలకు దూరమై ఎన్నో త్యాగాలు చేసి గ్రామ గ్రామాన అవగాహన కల్పించిన అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి, అర్హులైన మరికొందరిని విస్మరించిందని తెలిపారు. దాంతో వారు నేడు కూటికి లేక కూలినాలి చేసుకుంటున్నారని తెలిపారు. అర్హులైన కళాకారులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో కళాకారులు కర్క రమేష్, బి.నవీన్, చిట్టిబాబు, గోదావరి, మహేందర్, ఆంజనేయులు, స్రవంతి, నరేష్, సాయి బాబు, విజయ్, డప్పు సంతోష్, కలిగోట మహేష్, గంగాధర్, దత్తూ రాం, సిందుజ, రాజేష్, సంజీవ్, మహేష్ రెడ్డి, సద్గురు, లింగపురం సాగర్, మోర్తాడ్ రవి, కళాకారులు పాల్గొన్నారు. 


Similar News