టోల్ గేటు వద్ద వీసీని అడ్డుకున్న విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు

తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ వీ.సీ రవీందర్ గుప్తాను విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు మంగళవారం భిక్కనూరు టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

Update: 2023-06-06 15:51 GMT

మూడు గంటల పాటు సైలెంట్ గా విచారణ

వీసీ వద్ద ఉన్న కీలక ఫైళ్లు స్వాధీనం

దిశ, భిక్కనూరు : తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ వీ.సీ రవీందర్ గుప్తాను విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు మంగళవారం భిక్కనూరు టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వీసీని టోల్ గేటు క్యాబిన్ లోకి తీసుకెళ్లి పలు అంశాలపై అధికారులు ప్రశ్నించారు. ఆయన వద్ద ఉన్న ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకొని క్షుణ్ణంగా పరిశీలించారు.

ముందుగా తెలంగాణ విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్ కి వెళ్లిన విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ అధికారులకు అక్కడ వీసీ లేడన్న విషయం తెలసి వీసీకి ఫోన్ చేసినట్లు సమాచారం. అయితే, వీసి రవీందర్ గుప్తా మాత్రం సౌత్ క్యాంపస్ లో వెళ్తున్నానని వారితో చెప్పారు. వీసీ అక్కడికి రాలేదని సమాచారం రావడంతో వీసీ భిక్కనూరు టోల్ గేటు వద్ద ఉన్నట్లు లోకేషన్ గుర్తించారు. అధికారులు అక్కడికి చేరుకొని వీసీని టోల్ గేటు వద్ద అడ్డగించి వీసీ వద్ద ఉన్న ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ముందు టోల్ గేట్ బూతు పక్కన తన వాహనాన్ని పక్కన ఆపి అదే వాహనంలో కూర్చోబెట్టారు.

అక్కడి నుంచి టోల్ గేట్ క్యాబిన్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించినట్లు సమాచారం. విషయం తెలుసుకొని స్థానిక విలేకరులు అక్కడికి వెళ్లగా.. అప్పటికే వీసీ సౌత్ క్యాంపస్ కి వెళ్లి ఆ తరువాత కొద్దిసేపటికి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లాడు. అనంతరం అధికారి వద్దకు సాయంత్రం ఏడు గంటలకు వెళ్లి ప్రశ్నించగా 'దిశ' తనకేమీ తెలియదని సమాధానం చెప్పాడు. ఇప్పటి వరకు క్యాబిన్ లోకి వెళ్లి మీరే కదా ఫైళ్లు చెక్ చేసిందని ప్రశ్నించగా.. తాను వెయిటింగ్ అధికారినంటూ బస్సు ఎక్కి హైదరాబాద్ కు వెళ్లిపోయారు.

Tags:    

Similar News