ఉత్తంకుమార్ దేశద్రోహిలా మాట్లాడుతున్నారు

తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఆర్సీ సీసీఏ అమలు చేసేది లేదన్న రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దేశద్రోహిలా మాట్లాడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఆరోపించారు.

Update: 2024-04-03 10:19 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఆర్సీ సీసీఏ అమలు చేసేది లేదన్న రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దేశద్రోహిలా మాట్లాడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఆరోపించారు. బుధవారం నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ విలేకరులతో మాట్లాడుతూ...మంత్రి ఉత్తమ్ పై ఫైర్ అయ్యారు. మంత్రి ఉత్తమ్ ఎన్​ఆర్సీ అమలు చేయమని ఏ హోదాతో అధికారికంగా చెప్పారు అని ప్రశ్నించారు. మొన్నటి వరకు ఎంపీగా ఉన్న ఉత్తమ్ పార్లమెంటు గౌరవాన్ని కించపరిచాడు అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది అన్నారు. సీసీఏ ని అమలు చేయాలని దేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలో నెహ్రూ ప్రభుత్వమే చెప్పింది అన్నారు.

    ముస్లిం ఓట్ల కోసమే కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది అన్నారు. దేశంలో దేశద్రోహులు రావడానికి ఎన్ ఆర్ సీ వద్దని మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశద్రోహ చర్యకు పాల్పడ్డాడు అని, అతన్ని రాష్ట్ర మంత్రివర్గం నుంచి భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశ సమగ్రత కోసం శాంతి సామరస్యాల కోసం పార్లమెంటు చేసే చట్టాలను అందరూ గౌరవించాల్సిందే అన్నారు.

     ఉత్తమ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించాలి అని కోరారు. రాష్ట్రం బాగుండాలంటే నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ ని ఓడించాలి అని అరవింద్ పిలుపునిచ్చారు. ఉత్తమ్ మాటలు దేశద్రోహం కిందకి వస్తాయని అన్నారు. మంత్రి పదవికి ఉత్తమ్ రాజీనామా చేయాలి అని కోరారు. దీనిపై ప్రభుత్వ వైఖరిని సీఎం రేవంత్ క్లారిఫై చేయాలి అన్నారు. పైలట్ గా పనిచేసిన ఉత్తమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఓ కళంకం అన్నారు. గత 75 ఏళ్లుగా కాంగ్రెస్ దేశానికి శత్రువుగా, భారంగా మారింది అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. 


Similar News