ఆర్మూర్ లో ఇద్దరు దొంగలు అరెస్ట్…

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో చోరీకి పాల్పడ్డ ఇద్దరు దొంగలను ఆర్మూర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Update: 2024-06-11 16:41 GMT

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో చోరీకి పాల్పడ్డ ఇద్దరు దొంగలను ఆర్మూర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. శుక్రవారం పెర్కిట్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రి సమయంలో దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు దొంగలు ఫ్యాను, సిలిండర్ ఇతర వస్తువులను చోరీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎం లు కాలనీలో విధులకు వెళ్లిన సమయంలో గత శుక్రవారం ఆసుపత్రిలో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలు మళ్లీ చోరీకి ప్రయత్నించారు. ఆరోగ్య ఉప కేంద్రంలోని ఉద్యోగులు, సిబ్బంది, స్థానిక కాలనీవాసుల సహాయంతో ఇద్దరు దొంగలను పట్టుకొని ఆర్మూర్ పోలీసులకు అప్పగించగా ఆర్మూర్ పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు.


Similar News