రెచ్చిపోయిన దొంగలు.. ఒకే రోజు మూడు ఇండ్లలో చోరీ..
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో సోమవారం అర్ధరాత్రి మూడు ఇళ్లలో చోరీ జరిగింది.
దిశ, ఎల్లారెడ్డి : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో సోమవారం అర్ధరాత్రి మూడు ఇళ్లలో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దుంపల బాలరాజు ఇటీవల ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లినట్లు తెలిపారు. ఇదే అదనుగా భావించిన దొంగలు సోమవారం రాత్రి ఆయన ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడి దుంపల బాలరాజుకు చెందిన ఇంటి బీరువాలో ఉన్న సుమారు ఆరు తులాల బంగారం, దుంపల దత్తు, దుంపల కాశీరామ్ కు చెందిన రెండు ఇండ్లలోని రెండు బైకులను చోరీ చేసినట్లు స్థానికులు తెలిపారు. చోరీ చేసిన బైకులో పెట్రోల్ అయిపోవడంతో ఒక ద్విచక్రవాహనాన్ని అక్కడే కొద్ది దూరంలో వదిలి వెళ్ళినట్టు స్థానికులు తెలిపారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు మంగళవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.