Bear Attack : బాలుడిపై ఎలుగుబంటి దాడి

Update: 2024-12-17 17:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో బాలుడిపై ఎలుగుబంటి దాడి(Bear Attack) చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం చెరువు కట్ట దగ్గరకు కాలకృత్యాలకు వెళ్లిన పరిగె ఆశ్విత్ కుమార్ పై ఎలుగుబంటి దాడి చేయగా.. చుట్టుపక్కల ఇండ్ల వారు కేకలు వేయడంతో ఎలుగుబంటి పారిపోయింది. అయితే బాలుడు ఎలుగుమబంటి నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నా తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని వెంటనే జిల్లా ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కాగా ఎలుగుబంటి దాడి సమాచారం తెలియడంతో ఫారెస్ట్ అధికారులు స్థానికులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. అడవికి దగ్గరగా ఉన్న స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు.


Similar News