దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఈనెల 3న పదవి స్వీకార ప్రమాణం చేస్తారని మాజీ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి అన్నారు. సోమవారం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈగ గంగారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నూతనంగా ఎన్నుకోబడిన ఆర్మూర్ ఎమ్మెల్యే, యూపీసీ చైర్మన్ నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నూతన ప్రమాణ స్వీకార మహోత్సవం ఈనెల 3న జరుగుతుందన్నారు. ఇందల్వాయి టోల్ గేట్ వద్ద నుంచి జిల్లా అధ్యక్షుడికి పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా శ్రేణులు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అదేరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార మహోత్సవం వేలాది జిల్లా పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించనున్నామని అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా, బోధన్ ఎమ్మెల్యే షకీల్, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ విఠల్ రావు, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, తెలంగాణ స్టేట్ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత, రెడ్ కో-చైర్మన్ ఎస్ఏ అలీం, నగర మేయర్ నీతూ కిరణ్‌లు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాలకు నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నగర టీఆర్ఎస్ అధ్యక్షులు సిర్ప రాజు తదితరులున్నారు.