పుట్టు పంచల కొరకు అమెరికా నుండి పుల్కల్‌కు ప్రయాణం
భారతీయ సాంస్కృతిని కాపాడుతూ పెద్దల నుంచి సంప్రదాయంగా జరుపుకునే పండుగలు, శుభకార్యాలు ఘనంగా బంధుమిత్రుల మధ్య జరుపుకుంటూ వస్తున్నాము.
దిశ, బిచ్కుంద: భారతీయ సాంస్కృతిని కాపాడుతూ పెద్దల నుంచి సంప్రదాయంగా జరుపుకునే పండుగలు, శుభకార్యాలు ఘనంగా బంధుమిత్రుల మధ్య జరుపుకుంటూ వస్తున్నాము. బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామానికి చెందిన గంగాధర్ అన్నపూర్ణ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆనవాయితీగా, సంప్రదాయంగా వస్తున్న శుభకార్యాలు ఆనందోత్సవాలతో బంధుమిత్రుల మధ్య పిల్లల పుట్టు పంచల కార్యక్రమాన్ని జరుపుకుందామని మన సాంస్కృతిని కాపాడుతూ సముద్రాలు దాటి వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి అమెరికా నుండి పుట్టు పంచల శుభకార్యం కోసం స్వగ్రామమైన పుల్కల్ వచ్చారు.
ఆనందోత్సవాలతో నూతన వస్త్రాలు ధరించి మందిరంలో ప్రత్యేక పూజలు చేసి పుట్టు పంచల శుభకార్యం ఘనంగా జరుపుకున్నారు. పాశ్చాత్య దేశాల్లో నేటి ఐటీ యుగంలో జీవిస్తున్న కొందరు యువకులు విదేశాల్లో ఉంటూ మన సంప్రదాయాలను మరచిపోతున్నారు. అలాంటిది విదేశాల్లో ఉంటున్న గంగాధర్, అన్నపూర్ణ దంపతులు మన సంప్రదాయాలను గౌరవిస్తూ అమెరికా నుంచి వచ్చి పుట్టిన ఊరును మరచిపోకుండా చిన్ననాటి స్నేహితులు, బంధుమిత్రుల మధ్య శుభకార్యం జరుపుకోవడం చాలా ఆనందాన్నిచ్చిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిరుపేదలకు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైన స్వచ్ఛంద సంస్థలకు నా వంతు సహాయ సహకారాలు అందించి నా పుట్టిన ఊరును మరచిపోనని గంగాధర్ తెలిపారు.