టైం 10:30 అయినా పత్తాలేని సిబ్బంది.. వివాదాస్పదంగా ఉన్నతాధికారుల తీరు

ఓవైపు ప్రభుత్వం చేపట్టే ఎటువంటి పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రానికి పంపించకుండా చాలా కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది.

Update: 2024-07-16 08:07 GMT

దిశ, గాంధారి: ఓవైపు ప్రభుత్వం చేపట్టే ఎటువంటి పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రానికి పంపించకుండా చాలా కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కొంతమంది ఎగ్జామ్స్ సెంటర్లకు భవిష్యత్తు కోసం రాసే పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యం కావడంతో వెనుదిరిగిన నిర్భాగ్యులు చాలామందే ఉన్నారు. అలా వారి నిమిషం లేటు అంటూ పంపిస్తే గంటలు గంటలుగా లేటుగా కార్యాలయాలకు వచ్చే అధికారులపై చర్యలు తీసుకోరా అని జనం ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో 10:30 దాటిన ఉన్నత స్థాయి అధికారులు జాడ లేకుండా పోయారు.

మండల కేంద్రం నిత్యం రద్దీగా ఉండే ఎంపీడీవో, ఎంఈవో కార్యాలయానికి అరగంట దాటినా ఉన్నతాధికారులు రాకపోవడంతో కింది స్థాయి సిబ్బంది కూడా అదే అదునుగా తీసుకుని లేటుగా వస్తున్నారు. ఆఫీసు టైం అరగంట దాటినా కార్యాలయాలకు తాళాలు తీయడం లేదు. ఈ విషయంలో ఉన్నత స్థాయి అధికారులే ఇలా చేస్తే కిందిస్థాయి సిబ్బంది ఇంకెలా చేస్తారని ప్రజలకు చర్చించుకుంటున్నారు. కాగా, వివిధ పనుల నిమిత్తం వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వచ్చిన కార్యాలయాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అందరూ సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని సామన్య జనం కోరుతున్నారు. 


Similar News