పిడుగుపడి ముగ్గురు విద్యార్థులకు గాయాలు..
నిజామాబాద్ నగరంలోని మాలపల్లిలో గల మదర్ సా మహేదుల్-అష్రఫ్ వద్ద పిడుగు పడి ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని మాలపల్లిలో గల మదర్ సా మహేదుల్-అష్రఫ్ వద్ద పిడుగు పడి ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి. శనివారం సాయంత్రం నిజాంబాద్ నగరంలో వడగళ్ల వాన కురిసిన విషయం తెలిసింది. సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో పిడుగుపాటుకు ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పిడుగు పాటుకు గురైన విద్యార్థుల్లో ఫతుల్లా, రిజ్వాన్ అవార్, యూనుస్ ఉన్నారు.
ఫతుల్లా పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. బాధిత విద్యార్థులందరి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు జమియత్ ఉలమా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మదర్సా నజామ్ హఫీజ్ మహమ్మద్ లయీఖ్ ఖాన్ వెల్లడించారు. ఈ ముగ్గురు విద్యార్థులు నిజామాబాద్ నగరానికికు చెందిన వారు. విద్యార్థుల తల్లిదండ్రులు తరలిరావడంతో మాలపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సాయంత్రం ప్రార్థనల అనంతరం వర్షానికి కురిసిన వడగలను ఏరుకునేందుకు వెళ్లిన విద్యార్థులపై పిడుగు పడ్డట్టు సమాచారం.