సినీ ఫక్కీలో చోరీ.. క్షణాల్లో లక్షలు మాయం
పట్టపగలే నగర నడి మధ్యలో మూడు లక్షల నగదును దోపిడీ చేసిన సంఘటన నిజామాబాద్ లో శుక్రవారం జరిగింది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పట్టపగలే నగర నడి మధ్యలో మూడు లక్షల నగదును దోపిడీ చేసిన సంఘటన నిజామాబాద్ లో శుక్రవారం జరిగింది. నగరంలోని ఎన్ టీ ఆర్ చౌరస్తాలోని ఒక ప్రైవేట్ కార్యాలయం వద్ధ ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి హైదరాబాద్ రోడ్డులోని హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లో డబ్బులను డ్రా చేసుకుని తన స్కూటర్ డిక్కీలో పెట్టుకొని ఎన్ టీఆర్ చౌరస్తాలో పని నిమిత్తం ఒక ప్రైవేట్ కార్యాలయానికి వెళ్లాడు. అతన్ని బ్యాంక్ నుంచి అనుసరించి బైక్ పై వచ్చిన అగంతకులు డిక్కీని తెరిచి అందులోని నగదును అపహరించి పరారీ అయ్యారు.
కార్యాలయంలో పనులు ముగించుకుని బయటకు వచ్చిన సదరు ఉద్యోగి డిక్కీ తెరిచి ఉండటాన్ని గమనించి పరిశీలించగా డబ్బుల చోరీని గుర్తించారు. బాధితుడు స్థానిక ఒకటవ టౌన్ పోలిస్ లకు ఫిర్యాదు చేశారు. అగంతకులు ప్రైవేట్ కార్యాలయం వద్ధ డిక్కీలో నుంచి దోపిడీ మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమోరాలో రికార్డు అయింది. ఒక వ్యక్తి హెల్మేట్, మరొక వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకుని వచ్చినట్టు చోరి వ్యవహరం మెత్తం రికార్డు కాగా సీసీటీవి పుటేజి ఆధారంగా పోలిస్ లు రెండుటీంలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చెపట్టారు. సీసీ టీవి పుటేజి లో బైక్ నంబర్, బ్యాంక్ పరిసరాలలో ఉన్న సీసీటీవి పుటేజీలను పరిశీలించి దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు పోలిసులు.