ఏటీఎం మిషన్లను ధ్వంసం చేసిన దుండగులు
నిజామాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న ఎస్బీఐ, హెచ్ డీఎఫ్ సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలలో చోరికి యత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు 1వ టౌన్ ఎస్ హెచ్ వో విజయ్ బాబు తెలిపారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న ఎస్బీఐ, హెచ్ డీఎఫ్ సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలలో చోరికి యత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు 1వ టౌన్ ఎస్ హెచ్ వో విజయ్ బాబు తెలిపారు. ఈ నెల 9వ తేదీన అర్ధరాత్రి హైదరాబాద్ కు చెందిన మహ్మద్ ఆలీ, మిర్జా అయాన్ బేగ్, నిజామాబాద్ కు చెందిన మహ్మద్ అర్భాజ్ లు బ్యాంక్ ఏటీఎంలలో చొరబడి వాటిని ధ్వంసం చేసి తప్పించుకు తిరుగుతున్నారు. గురువారం ఉదయం ముగ్గురిని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బంది వారిని పట్టుకుని అరెస్టు చేశారని, ముగ్గురిని రిమాండ్ కు పంపినట్లు ఎస్ హెచ్ వో తెలిపారు.