అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారు

కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో రైతులను,తెలంగాణ ప్రజలను మోసం చేసి గద్దె నెక్కిందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2024-04-13 15:40 GMT

దిశ,నిజాంసాగర్ : కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో రైతులను,తెలంగాణ ప్రజలను మోసం చేసి గద్దె నెక్కిందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం మహమ్మద్ నగర్ మండలంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రైతులను రుణ మాఫీ చేస్తామని నమ్మించి మోసం చేశారని అన్నారు. అదే విధంగా మహిళకు ప్రతి నెలా 2500 ఇస్తామని ఇప్పటివరకు ఏ ఒక్కరికీ రూపాయి కూడా వేయలేదని ఎద్దేవా చేశారు.

     తెలంగాణ ప్రజలపై కేసీఆర్ కు ఎనలేని ప్రేమ ఉందని అన్నారు. రైతులను గుండెల్లో పెట్టుకుని చూసిన ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రాణాలను ఫణంగా పెట్టి కొట్లాడి సాధించుకున్నాం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీల పేరిట తెలంగాణ ప్రజలను మోసం చేశాయని తెలిపారు. 6 గ్యారంటీ పేరుతో ప్రజలను మోసం చేసి అభివృద్ధి చేయకుండా చేతులెత్తేశారన్నారు. గతంలో జుక్కల్ నియోజకవర్గంను పట్టించుకున్న ప్రభుత్వం లేదని, స్వరాష్ట్రంలోనే జుక్కల్ నియోజకవర్గం 70 యేండ్ల లో జరగని అభివృద్ధి చేశామని, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ప్రజల దృష్టి మరల్చి పరిపాలిస్తున్నారు : మాజీ ఎమ్మెల్యే హన్మంతు షిండే

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చి పరిపలిస్తుందని మాజీ ఎమ్మెల్యే హన్మంతు షిండే అన్నారు. సంఘటితంగా ఉంటే గెలుపు ఖాయం అని, ఇచ్చిన హామీలను మరిచి టీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. అట్రాసిటీ కేసులు పెట్టి తమ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చిన్న చిన్న గ్రామాలను గుర్తించి గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నామని అన్నారు. సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని గుర్తుచేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి చూపించి ఓట్లు అడగాలని అన్నారు. దేవుని పేరుతో రాజకీయం చేయడం కాదు, అభివృద్ధి చేసి గ్రామాలలో తిరగాలని సూచించారు.

కేసీఆర్ హయాంలో అన్ని రంగాల అభివృద్ధి : మాజీ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు

కేసీఆర్ హయాంలో అన్ని రంగాల అభివృద్ధి జరిగిందని మాజీ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు అన్నారు. రైతులను ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే సారి 2 లక్షల రూపాయలు రుణ మాఫీ చేస్తామని అబద్ధపు హామీలతో రైతులను మోసం చేశారని అన్నారు. దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ లాంటి అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ది పథంలో నడిపించారని గుర్తు చేశారు.

సమస్యలపై పార్లమెంట్లో గలమెత్తుతా : గాలి అనిల్ కుమార్

మీ సమస్యలపై పార్లమెంట్లో గలమెత్తుతా,మీ కుటుంబ సభ్యునిగా కొట్లాడి జహీరాబాద్ ను అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్నారు. గెలిచిన వెంటనే రైలు మార్గం గురించి కేంద్రంతో కొట్లాడి అభివృద్ధి చేస్తామని అన్నారు. 70 యేండ్ల లో జరగని అభివృద్ధి కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాలలో జరిగిందని అన్నారు. కార్యక్రమంలో

     మండల పార్టీ అధ్యక్షుడు సాదుల సత్యనారాయణ, గున్కుల్‌ సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ, అచ్చంపేట సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డి, మల్లూరు విట్టల్ రెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, పట్లోళ్ల దుర్గారెడ్డి, ఇఫ్తార్, దఫెదర్ విజయ్, గంగారెడ్డి, లింగా గౌడ్, గైని విట్టల్, యాటకారి నారాయణ, శ్రీధర్ రెడ్డి, నరేష్, మోయిజ్, సురేష్, చందర్, కాశయ్య, సిరాజ్, లక్ష్మారెడ్డి, లక్ష్మీనారాయణ, రాజేశ్వర్ గౌడ్,సత్యనారాయణ, రఫీ, గోరేమియా,ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 


Similar News