గంప గోవర్ధన్ వచ్చే వరకు కాలువల పనులు నిలిపివేయాలని.. బైఠాయించిన మహిళలు

అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యుడు గంప గోవర్ధన్ అక్కడి నుంచి వచ్చేవరకు మురికి కాలువల పనులు నిలిపివేయాలని కోరుతూ..

Update: 2023-02-10 08:30 GMT

దిశ, భిక్కనూరు: అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యుడు గంప గోవర్ధన్ అక్కడి నుంచి వచ్చేవరకు మురికి కాలువల పనులు నిలిపివేయాలని కోరుతూ.. పాత హైవేపై ఉన్న బాధిత ఇండ్ల యజమానులు కుటుంబ సభ్యులతో వచ్చి శుక్రవారం జేసీబీలను వెనక్కి పంపించేసి రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గ్రామపంచాయతీ తీర్మానం మేరకు ఇరువైపులా 55ఫీట్లకు మురికి కాలువ నిర్మాణానికి అడ్డుగా ఉన్న నిర్మాణాలను జేసీబీని తెప్పించి కూల్చి వేత పనులు కొనసాగిస్తుండగా.. రైతుబంధు సేవా సమితి చైర్మన్ బోండ్ల రామచంద్రం, సొసైటీ చైర్మన్ గంగల భూమయ్య, వార్డు సభ్యురాలు బోండ్ల లావణ్య, ఐకెపి సిబ్బంది గంగల జయశ్రీ కాలనీ వాసులతో చేరుకొని జేసీబీని అడ్డుకుని గ్రామ సర్పంచ్ తునికి వేణు ఉపసర్పంచ్ నరేష్ 15 నిమిషాల పాటు వాగ్వాదానికి దిగారు.

గ్రామపంచాయతీ తీర్మానంతో తమకు సంబంధం లేదని, తమ ఇండ్లను కూల్చి వేస్తానంటే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుండి గ్రామపంచాయతీ కార్యాలయం చేరుకొని ఈవో సదాశివతో వాగ్వాదానికి దిగి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ఎలా కూల్చివేస్తారని ప్రశ్నిస్తూ నిలదీశారు. అంతటితో ఊరుకోకుండా సచివాలయ కార్యదర్శి సదాశివును, కంటి వెలుగు సిబ్బందిని బయటకు పంపి సచివాలయానికి తాళం వేశారు. అంతటితో ఊరుకోకుండా బాధిత మహిళలు సచివాలయం ఎదుట పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే భిక్కనూరు సిఐ తిరుపయ్య, రాజంపేట ఎస్ఐ రాజు, స్థానిక పోలీసులు లిఖితపూర్వకంగా రాసిస్తే ఒక పద్ధతి ప్రకారం పనులు కొనసాగుతాయని చెప్పడంతో బాధితులు లిఖితపూర్వకంగా రి ప్రజెంటేషన్ చేశారు. మొత్తానికి హై డ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది.

పాలకవర్గం, ప్రజల తీర్మానం మేరకు పనులను కొనసాగిస్తాం.. సర్పంచ్ తునికి వేణు

గ్రామ సభలో గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు చేసిన తీర్మానం మేరకు రోడ్డుకి ఇరువైపులా 55 ఫీట్లకు మురికి కాలువలను నిర్మించేందుకు పనులను కొనసాగిస్తున్నాం. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు. గ్రామ అభివృద్ధిలో భాగంగానే పార్టీలకు అతీతంగా పట్టణ ప్రజల అభిప్రాయాల మేరకే 55 ఫీట్ల మురికి కాలువ నిర్మించేందుకు గత నెల రోజుల క్రితమే ప్రతి ఇంటికి మార్కింగ్ చేశాం. వాటి ప్రకారమే 55 ఫీట్ల లోపు ఉన్న వాటిని కూల్చివేయడం జరుగుతుంది. భిక్కనూరు పట్టణంలో పాత జాతీయ గారికి ఇరువైపులా చాలా మంది మురికి కాలువలపైనే నిర్మాణాలు చేపట్టారని అన్నారు. రోడ్డుకి ఇరువైపులా 55 ఫీట్లకు మురికి కాలువల నిర్మాణాలను తప్పనిసరిగా పూర్తిచేసి తీరుతాం. కొందరు కావాలనే ఇలాంటి లేని పోని గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

పనులు కొనసాగిస్తామంటే ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తా భిక్కనూరు సిఐ తిరుపయ్య..

రోడ్డుకి రువైపులా గ్రామపంచాయతీ గ్రామ ప్రజల తీర్మానం మేరకు మురికి కాలువల నిర్మాణాలు ఒక పద్ధతిన కొనసాగిస్తామంటే తాము ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడానికి సిద్ధమన్నారు. రోడ్డును ఓ క్రమ పద్ధతిలో కాకుండా, అక్కడ కొంత ఇక్కడ కొంత పనులు చేపట్టవద్దని, ఒక సీక్వెన్స్ ప్రకారం పనులను చేయాలని సర్పంచ్ తునికి వేణుకు సూచించారు.

Tags:    

Similar News