died : కొడుకు చేసిన అప్పులు..తీర్చలేక తండ్రి మృతి
అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని దేవాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
దిశ,తాడ్వాయి : అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని దేవాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై వేంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం..దేవేపల్లి గ్రామానికి చెందిన సాయి రెడ్డి (47) చిన్న కొడుకు ఇంటి నిర్మాణం కొరకు అప్పులు చేసి చనిపోవడంతో.. ఆ అప్పుల భారం తనపై పడింది. దీంతో అప్పును తీర్చేది ఎట్లా అంటూ తీవ్రంగా కలత చెందేవాడని తెలిపారు. రోజు మాదిరి భార్యాభర్తలు ఇద్దరు భోజనం చేసి నిద్రించారని అన్నారు. ఎంతో మనోవేదనకు గురై తెల్లవారేసరికి ఇంటి ముందు ఉన్న పాత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మృతుడి భార్య టేకుల పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.