రూల్స్ వారికుండవా...

సామాన్యుడి బతుకు జట్కా బండి నడపాలంటే ఎన్నో ఒడిదుడుకులను ఎదురుకోవాల్సి వస్తుంది.

Update: 2022-10-20 11:30 GMT

దిశ, గాంధారి : సామాన్యుడి బతుకు జట్కా బండి నడపాలంటే ఎన్నో ఒడిదుడుకులను ఎదురుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ రంగ వాహనాలకు వర్తించని రూల్స్ కేవలం పొట్టకూటి కోసం ఆటో నడుపుకుంటున్న డ్రైవర్ మాత్రమే రూల్స్ అడ్డొస్తున్నాయి. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మాజీ వాడి రోడ్డు దగ్గర ఆర్టీవో సత్యనారాయణ ఆటోలను ఆపి తనిఖీ చేయడం సహజమే. కానీ ఇందులో తిరకాసు ఏంటంటే ఆర్టీవోతో పాటు కామారెడ్డి ఆర్టీసీ డీఎం దగ్గరుండి ఆటోలో నుండి ప్రయాణికులను దించి మరీ బస్సుల్లో ఎక్కించడం ఎంతవరకు సమంజసం అని కామారెడ్డి జిల్లా బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు బోదాస్ నర్సింలు అన్నారు.

ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల పరిమిత సంఖ్య 53, 54 ఉంటే అందులో పరిమితికి మించి 80 మందిని ఎక్కించుకుంటే అప్పుడు రూల్స్ అడ్డురావు.....? కానీ ఆటోనే జీవనోపాధిగా బ్రతికే డ్రైవర్ కు మాత్రం అనునిత్యం రూల్స్ తో ఫైన్లు వేయడం, ఫిట్నెస్ లేదని, యూనిఫామ్ ధరించలేని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నారని, ఇలా ఏదో ఒక వంకతో డ్రైవర్ల నుండి ముక్కు పిండి ఫైండ్ల రూపాయి డబ్బులు వసూలు చేస్తున్నారు.

అంటే ప్రభుత్వ అండతో నడిచే ఆర్టీసీకి ఓ న్యాయం.. ? ఆటో డ్రైవర్ సామాన్యుడికి ఒక న్యాయమా..? అని ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం ఆటో వారిపై కనికరించలేదు కనీసం ఆర్థిక సహాయం కూడా చేయలేదు రికార్స్ తమపై నిబంధనలు అంటూ వేధించడం ఎంతవరకు న్యాయం అన్నారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి బీఎమ్ఎస్ అధ్యక్షులు శంకర్, రాజయ్య, రమేష్, రంజిత్ నవీన్, వెంకట్ గౌడ్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Tags:    

Similar News