ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగలు… అంతరాష్ట్ర ముఠా పనేనని అనుమానాలు

కామారెడ్డి జిల్లాలో దొంగల ముఠా బరితెగించింది. ఏటీఎం మిషన్ తెరవడం, అందులో డబ్బులు దొంగలించడం కష్టంతో కూడిన పని అని ఏకంగా ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లారు

Update: 2024-07-09 08:54 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ ; కామారెడ్డి జిల్లాలో దొంగల ముఠా బరితెగించింది. ఏటీఎం మిషన్ తెరవడం, అందులో డబ్బులు దొంగలించడం కష్టంతో కూడిన పని అని ఏకంగా ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులోని బిచ్కుంద మండల కేంద్రంలో జరిగింది. మంగళవారం తెల్లవారుజామున కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రధాన రహదారిపై ఉన్న ఎస్బీఐ ఏటీఎంను దొంగలు ఎత్తుకెళ్లారు. క్వాలిస్ వాహనంలో వచ్చిన నలుగురు ఆగంతకులు ఏటీఎం ను రాడ్లతో పెకిలించి తీసుకుపోయారు. బిచ్కుంద మండల కేంద్రంలోని కుమ్మరి చెరువు ప్రాంతంలో ఏటీఎంలో వదిలేసి వెళ్లినట్టు గుర్తించారు. ఏటీఎం ను తెరిచి నగదును దొంగలించేందుకు ప్రయత్నించగా అలారం మోగడం తో ఏకంగా ఏటీఎ తో సహా పరారీ అయినట్టు గుర్తించారు. ఏటీఎంలో రూ. 3.95 లక్షలు నగదు ఉన్నట్టు తెలిసింది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు ఆధారంగా దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇక్కడ ఏటీఎం దొంగలించింది అంతరాష్ట్ర ముఠా అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.


Similar News