వాడి వేడిగా నిజామాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభంలోనే రసాభాసగా మారింది.

Update: 2024-06-22 07:36 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభంలోనే రసాభాసగా మారింది. నిర్ణయించిన తేదీ ప్రకారం ఈనెల 21న నిర్వహించాల్సిన మున్సిపల్ సమావేశం ఎందుకు వాయిదా వేశారో చెప్పాలంటూ బీజేపీ కార్పొరేటర్లు మేయర్ దండు నీతూ కిరణ్‌తో వాగ్వివాదానికి దిగారు. 21న శుక్రవారం కావడం మైనార్టీ కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కారని ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగానే సమావేశాన్ని ఎలా రద్దు చేశారని ప్రశ్నించారు. ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్ రాకపోతే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రద్దు చేయాల్సిన అవసరం ఏంటని తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగారు. లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చేవరకు సమావేశం ముందుకు సాగేది లేదని సభ్యులు పేర్కొన్నారు. దీంతో ఇకపై ఇలాంటి ఘటనలు జరగవని హామీ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు.

బాత్రూంకి వెళ్దామంటే డోర్లు లేని టాయిలెట్స్

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. శనివారం మున్సిపల్ కార్పొరేషన్‌లో కౌన్సిల్ జరుగుతున్న సందర్భంలో సమావేశానికి వచ్చిన నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, ఇతర అధికారులతో సుమారు 100 మందికి పైగా ఈ సమావేశంలో హాజరవుతారు. అయితే ఇక్కడే ఉంది అసలు కథ. సమావేశం కౌన్సిల్ హాల్ పక్కనే ఉన్న కనీస వసతులు లేక సభ్యులు కార్పొరేటర్లు, అధికారులు, పోలీస్ సిబ్బంది తీవ్ర ఇబ్బందికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగర పాలక సంస్థ కార్యాలయంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పబ్లిక్ టాయిలెట్ల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 


Similar News