జాబ్ పర్మినెంట్ కాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉద్యోగి.
ప్రభుత్వ ఆసుపత్రిలో, ఔట్సోర్సింగ్ కింద 2017 సంవత్సరంలో సాయిలు మాలి ఉద్యోగిగా జాయిన్ అయి ప్రభుత్వ ఆసుపత్రిలో నేటి వరకు తన విధులను నిర్వహిస్తున్నాడు.
దిశ, ఎల్లారెడ్డి : ప్రభుత్వ ఆసుపత్రిలో, ఔట్సోర్సింగ్ కింద 2017 సంవత్సరంలో సాయిలు మాలి ఉద్యోగిగా జాయిన్ అయి ప్రభుత్వ ఆసుపత్రిలో నేటి వరకు తన విధులను నిర్వహిస్తున్నాడు. మాలిగా ఆస్పత్రిలో కాంపౌండర్ గా అధికారులు చెప్పిన విధంగా తన పనులను తానుచేస్తూ కొనసాగిస్తున్నాడు. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగాలను తీసుకోవడంతో 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న సాయిలు తన పరిస్థితి చేజారిపోయిందేమోనని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యులు అప్రమత్తతో సాయిలును ఆసుపత్రికి తరలించడంతో, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు బీఎస్పీ నాయకులు ఎంఐఎం పార్టీ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిలను పరిశీలించి సాయిలు పట్ల ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుందని ధైర్యం నింపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా నాయకులు పద్మారావు ఎంఐఎం నాయకులు రజాక్ బీఎస్పీ నాయకులు మార్లు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.