వైద్యం అందక బాలిక మృతి

సరైన సమయంలో వైద్యం అందక బాలిక మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది.

Update: 2023-05-31 14:27 GMT

వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన

దిశ, కామారెడ్డి రూరల్ : సరైన సమయంలో వైద్యం అందక బాలిక మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాకు చెందిన లావణ్యకు వడదెబ్బ తగిలింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. బాలిక పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక వార్డులో చికిత్స అందించాల్సింది పోయి, బెడ్లు లేవనే సాకుతో వైద్యులు, సిబ్బంది లావణ్యకు క్యాన్సర్ వార్డులో బెడ్ కేటాయించారు. దీంతో లావణ్యకు అక్కడ సరైన వైద్యం అందకపోవడంతో మంగళవారం మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యుల నిర్లక్ష్యంతోనే లావణ్య మృతి చెందిందని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాలిక మృతికి కారణమైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News