Thai bazaar : రైతు మొహం వీుద డబ్బులు విసిరిన ..తైబజార్‌ వసూలుదారుడు

రైతో రైతో..రైతో పాడుగాను నీ బతుకు..అన్నట్టుగా అంగట్లో సంఘటన జరుగుతున్నాయి.

Update: 2024-10-27 16:04 GMT

దిశ, గాంధారి: రైతో రైతో..రైతో పాడుగాను నీ బతుకు..అన్నట్టుగా అంగట్లో సంఘటన జరుగుతున్నాయి. కూరగాయలు అమ్ముకునేందుకు వచ్చిన రైతు, తైబజార్ వసూలుదారుడికి డబ్బులు తక్కవ ఇచ్చాడని..రైతు మొహం వీుద డబ్బులు విసిరిన సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఆదివారం అంగట్లో చోటుచేసుకుంది.

అంగట్లో తైబజార్ వాలాల జూలూమ్......

మేజర్ గ్రామపంచాయతీలో ఆదివారం అంగడి కావడంతో 44 గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు క్రయ విక్రయాలు అధికంగా జరుగుతాయి. ముఖ్యంగా ఆదివారం ఉదయం మేకల అంగడి వద్ద అంతేకాకుండా కూరగాయల అంగట్లో తైబజార్లు వాళ్ళ జులుం ప్రదర్శించి వారు చెప్పిందే వేదం అడిగిన అన్ని డబ్బులు ఇవ్వాల్సిందే. కనీసం డబ్బులు చెల్లించినట్టు రసీదు కనీసం చిట్టి కూడా ఉండదు. ఇష్టానుసారంగా మాటలకు అదుపు లేకుండా నోరు పారేసుకుంటూ డబ్బులు ఇవ్వు లేదంటే తక్కెడ బాట్లు తీసుకుని పోతా అని బెదిరించడమే తరువాయిగా మారింది. పోనీ తై బజార్ వాలాలు మంచిగానే వసూలు చేసి నాకు 50 రూపాయలు అందాయి అని ఒక చిట్టి గానీ రసీదు కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. మేకల అంగడి వద్ద కూడా చిన్న మేక పిల్ల అయినా సరే 50 రూపాయలు ఇవ్వాల్సిందే. పెద్ద మేకైనా సరే 50 నుంచి 100 రూపాయలు ఇవ్వాల్సిందే. దీనికి ఎలాంటి రసీదులు ఉండవు..కూరగాయల అంగట్లో కూడా ఒక్క గుళ్ళనిండా కూరగాయలు రెండు లేకపోతే మూడు రకాల కూరగాయలు అమ్మిన మొత్తం మీద 50 కంటే ఎక్కువ రూపాయలే ఇచ్చేదాకా అంగట్లో అమ్ముకునేందుకు వచ్చిన విక్రయ దారుడుల నుంచి వదలకుండా జులుం ప్రదర్శించి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు.

50 రూపాయలు ఇవ్వకపోతే తక్కడి,బాట్లు తీసుకుపోతాం...

అంగట్లో అమ్ముకునేందుకు వచ్చినా విక్రయాలు తప్పనిసరిగా 50 రూపాయల నుంచి పైనే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే బాట్లు తక్కడ తీసుకొని వెళ్తామని హెచ్చరిస్తుంటారు. ఇది ఎంతవరకు న్యాయం డబ్బులు ఇచ్చేది మామూలే మళ్లీ మీది నుంచి ఇలా అనడం సమంజసమా అని విక్రయాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

35 రూపాయలుగా నిర్ధారించామని తెలిపిన సెక్రటరీ నాగరాజు

వేలం పాటలో దైవదారును 4 లక్షల పైచిలుకు వేలంపాడి దక్కించుకున్న సదరు వ్యక్తికి ముందస్తుగానే ఏ ఏ వాటికి ఎంతెంత డబ్బులు తీసుకోవాలో లిఖితపూర్వకంగా రాసి ఇచ్చామని, అంగట్లో తైబజార్ 35 రూపాయలుగా నిర్ధారించి చిట్టి ఇవ్వాల్సిందిగా చెప్పడం జరిగిందని సెక్రెటరీ నాగరాజు తెలిపారు. తై బజార్ వేలంపాట నిర్వహించిన సమయంలో తహసిల్దార్ సతీష్ రెడ్డి, ఎంపీడీవో రాజేశ్వర్, తాజా మాజీ సర్పంచ్ సంజు యాదవ్ పిఎసిఎస్ డైరెక్టర్ సాయిలు వివిధ పార్టీల నాయకులు అందరూ పాల్గొని వేలంపాట నిర్వహించరని తెలిపారు.కానీ అందరి సమక్షంలో జరిగిన వేలం పాటకు 35 రూపాయలకు 50 రూపాయలు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం అని విక్రయదారులు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విక్రయదారులు తమ గోడు వ్యక్తం చేస్తున్నారు.


Similar News