కలెక్టరేట్ లోని ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గల వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Update: 2022-10-20 11:12 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గల వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక్కో శాఖ వారీగా అధికారులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా కొనసాగుతున్న సుధీర్ కుమార్ అనే ఉద్యోగి అనధికారికంగా విధులకు గైరుహాజరు కావడాన్ని గమనించిన కలెక్టర్, సదరు ఉద్యోగికి మెమో జారీ చేసి సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. కలెక్టరేట్ ఏ.ఓ కార్యాలయంతో పాటు డీపీఆర్ఓ, డీపీఓ, డీఆర్డీఓ, డీటీడబ్ల్యుఓ, డీఎస్ఓ, డీఈఓ, డీసీఓ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, గనులు భూగర్భ జల వనరులు తదితర శాఖలను తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లో నెలకొని ఉన్న వసతులను, నిర్వహణ తీరును గమనించి అధికారులకు పలు సూచనలు చేశారు.

సమయపాలన పాటిస్తూ, శ్రద్ధగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యాలయాలతో పాటు, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని హితవు పలికారు. వివిధ శాఖల్లోని రికార్డులు, ఫైళ్ల భద్రత కోసం కిటికీలకు ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయించాలని కలేక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ కు సూచించారు. అలాగే, మొదటి అంతస్తులోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ ను కలెక్టర్ పరిశీలించారు. ఉద్యోగుల సౌకర్యార్థం నెలకొల్పిన క్యాంటీన్ ను సందర్శించి, పారదర్శకత కోసం ధరల పట్టికను ప్రదర్శించాలని నిర్వాహకులను ఆదేశించారు. వివిధ కార్యాలయాలను సందర్శించిన సందర్భంగా అక్కడక్కడా లీకేజీలు, ఇతర చిన్నచిన్న లోపాలను గమనించిన కలెక్టర్, వెంటనే వాటికి మరమ్మతులు చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండేలా వాటి నిర్వహణను మరింత మెరుగుపర్చాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ వెంట వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

Tags:    

Similar News