రజాకార్ల పాలనను గుర్తుతెస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రజాకారుల పాలన గుర్తుకు తెస్తుందని, అందుకు నిదర్శనం అవినీతి దోపిడీ లే అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.

Update: 2024-04-06 09:51 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రజాకారుల పాలన గుర్తుకు తెస్తుందని, అందుకు నిదర్శనం అవినీతి దోపిడీ లే అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ప్రతిపక్షాలు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న రైతులకు రెండు లక్షల రుణమాఫీ అందిస్తామని అబద్ధపు ప్రచారం చేసిందని ఆయన ఆరోపించారు.

    తెలంగాణలో దోచుకున్న సొమ్మును దక్షిణ తెలంగాణకు ముఖ్యంగా కొడంగల్ ప్రాంతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని ఆయన సొంత నియోజకవర్గానికి మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికీ రుణమాఫీ చేయలేదన్నారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 అందిస్తామని, రైతు భరోసా సైతం ఇప్పటికి వేలాదిమందికి డబ్బులు పడడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు హైదరాబాద్లోని బిల్డర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ, కోట్ల రూపాయలను దండుకుంటున్నారని అన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల సమయంలోనే సుమారు 50 వేల కోట్లకు పైగా నే దోచుకుపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుందని అన్నారు.

    ఉత్తర తెలంగాణకు ఇద్దరు మంత్రులు మాత్రమే ఉంటే దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రి కేబినెట్లో ఆరుగురు మంత్రులను తీసుకోవడం వెనక చూస్తుంటే మతలబు ఏంటని ఆయన ప్రశ్నించారు. హిందుత్వం అంటే కాంగ్రెస్ పార్టీకి గిట్టదని, మైనారిటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వంత పాడుతుందని, ఆయన భారత రాజ్యాంగాన్ని మత ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ విడదీసిందని, మాజీ ప్రధాని జవహర్​లాల్ నెహ్రూ వల్లే భారతదేశం విడిపోయిందని అన్నారు. ప్రపంచ దేశాల్లో ప్రధాని మోడీ అనతి కాలంలోనే ఖ్యాతిని సంపాదించారని, దేశం భద్రంగా ఉండాలంటే మరోసారి ప్రధాని మోడీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి పటేల్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, న్యాలంరాజు, మహిళా కార్పొరేటర్ పంచ రెడ్డి ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. 


Similar News