ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన జరగాలి : ఎమ్మెల్యే

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరగాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు.

Update: 2024-07-10 16:40 GMT

దిశ, కామారెడ్డి : ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరగాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. తన క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో పాటు గురుకులాల ప్రిన్సిపాళ్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండాలని, మౌళిక వసతుల కల్పన విషయంలో రాజీ పడకుండా ఉండాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలన్నారు. పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను ఇతర పాఠశాలల నుంచి డిప్యూటేషన్ ద్వారా పంపించాలన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. భూముల రెవెన్యూ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలన్నారు. సర్వేయర్లు రైతులు సర్వేకు కట్టిన వాటిలో పెండింగ్ ఉన్న వాటిని వెంటనే సర్వే చేయాలని సూచించారు.


Similar News