రైస్ మిల్లు పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

టాస్క్ ఫోర్స్ పోలీసులు పీడీఎస్ బియ్యం తో రీసైక్లింగ్ జరుగుతున్న దందాను గుట్టు రట్టు చేశారు. బోధన్ డివిజన్ కేంద్రంగా సీఎంఆర్ కోసం రైస్ మిల్లులు తీసుకొని వాటిని తిరిగి ఎస్సే కి అప్పగించే దందా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది.

Update: 2023-12-11 03:29 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : టాస్క్ ఫోర్స్ పోలీసులు పీడీఎస్ బియ్యం తో రీసైక్లింగ్ జరుగుతున్న దందాను గుట్టు రట్టు చేశారు. బోధన్ డివిజన్ కేంద్రంగా సీఎంఆర్ కోసం రైస్ మిల్లులు తీసుకొని వాటిని తిరిగి ఎస్సే కి అప్పగించే దందా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. బోధన్‌కు చెందిన ఒక మాజీ ప్రజా ప్రతినిధి అండతో సీఎంఆర్ తీసుకున్న రైస్ మిల్లులు సంబంధిత ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకొని సీఎంఆర్ కోసం పిడిఎఫ్ రైస్ పై ఆధారపడడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం రాత్రి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి రాజశేఖర్ రాజ్ ఆధ్వర్యంలో సిఐ అంజయ్య తన సిబ్బందితో ఎడపల్లి శివారులోని ఒక రైస్ మిల్ పై దాడి చేశారు.

ఇతర ప్రాంతాల నుంచి డీసీఎం ద్వారా సేకరించిన పిడిఎస్ రైసును రైస్ మిల్లులో డంపు చేస్తున్న రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిజామాబాద్ కేంద్రంగా పిడిఎస్ రైస్ దందా నిర్వహిస్తున్న వ్యక్తులకు సంబంధించిన బియ్యం డంప్ అవుతుండగా పట్టుకున్నారు. బియ్యం సీజ్ చేసి రైస్ మిల్లు కూడా సీజ్ చేసేందుకు అధికారులకు నివేదిక సమర్పిస్తామని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యం 50 టన్నుల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇల్లీగల్ దందాపై కమిషనర్ కొరడా జూలిపిస్తుండడంతో అక్రమార్కులు దందాల నిర్వహణపై గగ్గోలు పెడుతున్నారు. గతంలో లోకల్ పోలీసులను, టాస్క్ ఫోర్స్ పోలీసులను కూడా పిడిఎస్ మాఫియా మేనేజ్ చేసిందని విమర్శలు ఉన్నాయి.


Similar News