ఆర్మూర్‌లో ఎక్సైజ్ ఎస్సై సస్పెన్షన్..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా
దిశ, ఆర్మూర్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా కేంద్రంలో బిట్ కాయిన్ కేసులో ఇటీవల అరెస్టు అయిన ఆర్మూర్ ఎక్సైజ్ శాఖ ఎస్సై గంగాధర్ బుధవారం సస్పెండ్ అయినట్లు వరంగల్ నోడల్ డీసీ అంజన్న ద్వారా ఉత్తర్వులు వెలువడ్డాయి. యూనిట్ కాయిట్ పేరిట ఆర్థిక మోసాలకు ఎస్సై గంగాధర్ పాల్పడగా ఈనెల ఒకటో తేదీన పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఆర్మూర్ ఎక్సైజ్ శాఖ ఎస్ హెచ్ ఓ స్టీవెన్సన్ వివరణ కోరగా ఆర్మూర్ ఎక్సైజ్ ఎస్సై గంగాధర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు వరంగల్ నోడల్ డీసీ అంజన్న ద్వారా ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు.