ఇళ్ల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు

Update: 2024-12-12 12:24 GMT

దిశ, కామారెడ్డి : ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కామారెడ్డి మండలం గూడెం గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇళ్ల సర్వే లో  దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల పూర్తి వివరాలను సేకరించి యాప్ లో నమోదు చేయాలని, అవసరమైన భూమి పత్రాలు, ఆహార భద్రత కార్డు, ఇంటి యజమానురాల ఫోటో  సేకరించాలని, తద్వారా యాప్ లో పొందుపరచాలని తెలిపారు. సర్వేకు ఒకరోజు ముందు ఆ గ్రామంలో చాటింపు వేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ్ రావు, తహసీల్దార్ జనార్ధన్, పంచాయతీ కార్యదర్శి, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సామాజిక సేవలు అభినందనీయం...

సమాజంలో సామాజిక సేవలు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం స్థానిక రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో..ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 25 మంది బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రోటరీ వరంగల్ సెంట్రల్ క్లబ్ రోటేరియన్ జూలూరు కృష్ణమూర్తి సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. సామాజిక సేవా దృక్పథంతో రోటరీ క్లబ్ ద్వారా విద్య, వైద్యం, పర్యావరణం వంటి అంశాలలో సమాజ చేయడం జరుగుతున్నాయని కొనియాడారు. మున్ముందు కూడా రోటరీ క్లబ్ ద్వారా సమాజ సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి రాజు, రొటీరియన్ కోరే చంద్రమౌళి వరంగల్, జి.జ్ఞాన ప్రకాష్ అసిస్టెంట్ గవర్నర్, క్లబ్ సెక్రటరీ సత్యనారాయణ, కోశాధికారి సబ్బని కృష్ణ హరి, సీనియర్ రోటీరియన్ శ్రీశైలం, ప్రోగ్రాం చైర్మన్ పి.సత్యం, ధనుంజయ, బాలకిషన్, నాగభూషణం, డి.వి. వెంకటరాజం, భాస్కర్, జైపాల్ రేడ్డి , చంద్రశేఖర్, హెచ్.ఎన్.రెడ్డి, శంకర్, విద్యార్థినులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News