స్నేహితుడి మరదలి పెళ్లికి వెళ్లి..అనంత లోకాలకు

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కొటార్ మూర్ కు చెందిన స్నేహితుడు అక్షయ్ మరదలు పెళ్లికి వచ్చి ఓ యువకుడు అనంత లోకాలకు పయనమయ్యాడు

Update: 2024-12-12 14:24 GMT

దిశ ,ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కొటార్ మూర్ కు చెందిన స్నేహితుడు అక్షయ్ మరదలు పెళ్లికి వచ్చి ఓ యువకుడు అనంత లోకాలకు పయనమయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తికి చెందిన మృతుడు ప్రకాష్ స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుంచి కారులో భీంగల్ కు వెళ్లి స్నేహితుడు అక్షయ్ మరదలి వివాహానికి బుధవారం హాజరయ్యారు. వివాహం పూర్తయిన తర్వాత భీంగల్ నుంచి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కొటార్ మూర్ ప్రాంతానికి తిరిగి వచ్చి.. స్నేహితుడు అక్షయ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి సుమారు గురువారం ఉదయం 2 గంటల ప్రాంతంలో వాహనంపై డ్రైవర్ మద్దెల చందు తో సహా ఏడుగురు టీ త్రాగడానికి కాంతి హై స్కూల్ నుండి వెళ్తుండగా నిర్లక్ష్యమైన డ్రైవింగ్ తో చెట్టుకు ఢీ కొట్టారు. అనంతరం స్పీడ్ బ్రేకర్ వద్ద కారు అదుపుతప్పడంతో..కంట్రోల్ చేయలేక కారు పల్టీలు కొట్టింది. నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ తో రోడ్డు ప్రమాదం జరిగిన ఈ సంఘటనలో నలుగురికి గాయాలు కాగా..వారిని చికిత్స నిమిత్తం ఆర్మూర్ లోని స్థానిక ఆశ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సంఘటనా స్థలంలో గాయపడిన వారికి చికిత్సలు అందిస్తుండగా..తీవ్రంగా తలకు గాయమైన ప్రకాష్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా మిగతా ముగ్గురు మిత్రులకు ఆశాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన ప్రకాష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Similar News