విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలి
పదవ తరగతి విద్యార్థులు ప్రణాళిక ప్రకారం పట్టుదలతో చదివి తమ గమ్యం చేరుకోవాలని జిల్లా విద్యాధికారి రాజు అన్నారు.

దిశ , గాంధారి : పదవ తరగతి విద్యార్థులు ప్రణాళిక ప్రకారం పట్టుదలతో చదివి తమ గమ్యం చేరుకోవాలని జిల్లా విద్యాధికారి రాజు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకుంటున్న 111 మంది విద్యార్ధిని, విద్యార్థులకు ప్యాడ్లు ,పెన్నులను జిల్లా విద్యాధికారి రాజు చేతుల మీదుగా ప్రత్యేక ఉపాద్యాయుడు పెంటయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆయన అన్నారు. మండల విద్యాధికారి శ్రీహరి మాట్లాడుతూ.. మండలంలో దాదాపు 400 మంది విద్యార్థులు పదవ తరగతి చదువుకుంటున్నారని, పట్టుదలతో చదివి ప్రశాంతంగా పరీక్షలు రాసినప్పుడే 100% ఫలితం వచ్చే ఆస్కారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు వెంకటేశ్వర్ గౌడ్, శ్రీనివాస్, కుమార స్వామి,పి.ఆర్.టి.యు. మండల అధ్యక్షులు ప్రకాష్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.