రైతుల జీవితాల‌తో చెల‌గాటం ఆడొద్దు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

రైతు రుణమాఫీ అయిందని అసెంబ్లీలో మాట్లాడుతున్న మంత్రులు క్షేత్ర

Update: 2025-03-25 13:07 GMT
రైతుల జీవితాల‌తో చెల‌గాటం ఆడొద్దు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
  • whatsapp icon

దిశ, హన్వాడ : రైతు రుణమాఫీ అయిందని అసెంబ్లీలో మాట్లాడుతున్న మంత్రులు క్షేత్ర స్థాయిలోకి వస్తే వాస్తవాలు తెలుస్తాయని, ప్రభుత్వం రైతుల పాలిట నిర్లక్ష్యం వహిస్తే మరో పోరాటానికి రైతులు సిద్ధమ‌వుతారని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం ఆయన హన్వాడ మండల పరిధిలోని నాయినోనిపల్లి గ్రామంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రైతులకు ఇస్తామని చెప్పిన రైతు బంధు, రుణమాఫీ అందరికీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వడగండ్ల వానతో పంటలు పూర్తిగా దెబ్బతిన్న వాటికీ నష్ట పరిహారం చెల్లించాల‌ని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు నష్టపోకుండా మొలకెత్తిన వడ్లను కూడా కొనుగోలు చేశామ‌ని ఆయన గుర్తు చేశారు. వానకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 40 వేల సహాయం అందించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టపోయిన రైతుల వివరాలని ప్రభుత్వానికి పంపించాలని అన్నారు. రైతుల జీవితాల‌తో చెల‌గాటం ఆడొద్ద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్, రైతు కమిటీ అధ్యక్షులు కొండయ్య, సీనియర్ నాయకులు నెత్తికొప్పుల శ్రీను, చెన్నయ్య, జంబులయ్య, పెద్ద చెన్నయ్య, రాజు యాదవ్, అనంత రెడ్డి, బాలకిష్టయ్య, హరీష్ చందర్, వెంకన్న, మాధవులు, శ్రీనివాసులు, వెంకటయ్య, తిరుపతయ్య, బలవర్ధన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Similar News