ఎంపీ అరవింద్ ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు..

నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని నరేంద్రమోడీ వెంటనే స్పందించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు ఆర్ గౌతం కుమార్, ఏఐపీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.

Update: 2024-06-22 12:37 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని నరేంద్రమోడీ వెంటనే స్పందించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు ఆర్ గౌతం కుమార్, ఏఐపీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎంపీ అరవింద్ ఇంటి ముట్టడి చేశారు. దీంతో పోలీసులు ఆందోళన కారుల పై స్వల్ప లాఠీ చార్జీ చేశారు. అనంతరం అరెస్టు చేసి 3వ టౌన్ కి తరలించారు. అరెస్టు అయిన విద్యార్థి సంఘాల నాయకులను ఎన్ఎస్యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా ఇంచార్జి వెంకటస్వామి పరామర్శించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు గౌతం కుమార్, ఏఐపీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ అనిల్ కుమార్ లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకై ఫలితాల్లో స్కామ్ జరిగిందని అన్నారు. ఒకే పరీక్ష కేంద్రంలో 8 విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అన్నారు. ఒక్కో పరీక్ష పత్రం లెకేజీలో లక్షల రూపాయలు చేతులు మారాయని అన్నారు. లక్షలాదిమంది జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని, ఓకే పరీక్ష కేంద్రంలో 67 మందికి ఎలా టాప్ ర్యాంకులు ఎలా వస్తాయని అన్నారు.

సుప్రీంకోర్టులో కూడా పలు పిటిషన్లు దాఖలు అయ్యాయని, నీట్ పరీక్ష ఫలితాలు జూన్ 14న విడుదల చేయాల్సింది. ఎన్నికల ఫలితాల రోజే నాలుగున ఎందుకు విడుదల చేశారని వీటన్నిటిని చూస్తే ఫలితాల్లో జరిగాయని, కావున సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మోడీ వెంటనే రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని, నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, ఏఐపీఎస్యూ సాయికుమార్, ఎన్ఎస్యూ ఐ జిల్లా అధ్యక్షులు వేణు రాజ్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మహేష్, విఘ్నేష్, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు అంజలి, పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేందర్, డా.గణేష్, విద్యార్థి సంఘాల నాయకులు ప్రిన్స్, కార్తీక్, సాయినాథ్, నిఖిల్ రెడ్డి, గణేష్, ఆజాద్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.


Similar News