ఎస్సారెస్పీ అధికారులు అప్రమత్తంగా ఉండాలి

శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ కు వరద పోటెత్తడంతో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం పరిశీలించారు.

Update: 2024-09-02 09:13 GMT

దిశ, బాల్కొండ : శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ కు వరద పోటెత్తడంతో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్సారెస్ప అధికారులతో మాట్లాడి మహారాష్ట్ర నుండి వస్తున్న వరద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూడు లక్షల వరకు వరద వస్తుందని మహారాష్ట్ర అధికారులు తెలిపారని ఎస్సారెస్పీ అధికారులు వివరించారు. ఇప్పటికే ఎస్సారెస్పీ వరద గేట్లను 40 ఎత్తి దిగువకు 1,50,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.

    అదేవిధంగా నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ఇప్పటికే వచ్చి చేరుతుందన్నారు. దిగువన, ఎగువన ఉన్న ప్రజలకు, గ్రామాలకు, వ్యవసాయ పంటలకు ఇబ్బంది తలెత్తకుండా నీటిని విడుదల చేయాలన్నారు. వారి వెంట సీపీ కల్మేశ్వర్, ఎస్ఆర్ఎస్పీ ఈఈ చక్రపాణి, ఏఈ వంశీ, సారిక, పోలీస్ సిబ్బంది ఉన్నారు. 

Tags:    

Similar News