ధనార్జనే ధ్యేయంగా పని చేస్తే చర్యలు తప్పవు : డాక్టర్ ప్రవీణ్ కుమార్

ఇబ్రహీం పట్నం సంఘటన నేపధ్యంలో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావ్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం బుధవారం పిట్లం మండల కేంద్రంలో మెరుపు దాడులు జరిపారు

Update: 2022-09-28 14:02 GMT

దిశ, పిట్లం : ఇబ్రహీం పట్నం సంఘటన నేపధ్యంలో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావ్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం బుధవారం పిట్లం మండల కేంద్రంలో మెరుపు దాడులు జరిపారు. మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులను, వాటి అనుమతి పత్రాలను తనిఖీ చెసారు. ఒక ప్రైవేట్ అసుపత్రిలో రికార్డులు సరిగ్గా లేనందున ఆసుపత్రి నిర్వాహకులకు నోటీసులు అందజేసారు. అనంతరం తనిఖీ బృందం ప్రత్యేక అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రైవేట్ అసుపత్రి నిర్వహకులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేయాలని, ఇష్టం వచ్చినట్టు ఆసుపత్రులను నడపరాదన్నారు. ఆసుపత్రులలో రోగులకు అన్ని వసతులు కల్పించాలని అన్నారు. కొంత మంది ఆసుపత్రి నిర్వహకులు నిబంధనలు పాటించకుండా ధనార్జనే ద్యేయంగా పని చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎచ్ ఈ ఓ వెంకటేశ్వర్, ఎచ్ ఏ సాయిలు, పిట్లం వైద్యులు రోహిత్ కుమార్, శివకుమార్ పాల్గొన్నారు.

Tags:    

Similar News