ఎడ్యుకేషన్, ఇరిగేషన్, శాంతిభద్రతల పై ప్రత్యేక దృష్టి

నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాత్ రూమ్స్, తరగతి గదులు తదితర సమస్యలను తీర్చి ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకొని ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తానని బోధన్ శాసనసభ సభ్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు.

Update: 2024-01-21 11:27 GMT

దిశ, నవీపేట్ : నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాత్ రూమ్స్, తరగతి గదులు తదితర సమస్యలను తీర్చి ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకొని ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తానని బోధన్ శాసనసభ సభ్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. మండలంలోని నాలేశ్వర్, తుంగిని, నిజాంపూర్, సిరన్ పల్లి, జాన్నే పల్లి, నారాయణ పూర్ గ్రామాలను పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. బినోల గ్రామంలో సహకార సంఘం నూతన కార్యాలయం, ఎరువుల గోదాంను విండో చైర్మన్ మగ్గరి హన్మాండ్లుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… బినోల విండో చైర్మన్ విన్నవించిన సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పాలకవర్గం రైతుల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.

యాసంగి పంటకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉంచామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నియోజకవర్గంలో ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌ లపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు, తరగతి గదులు, బాత్ రూమ్‌ల కొరత తీర్చి ఉపాధ్యాయులను నియమిస్తామని, ప్రజలు ప్రైవేట్ స్కూల్‌లకు కాకుండా గవర్నమెంట్ స్కూల్‌లకు పంపాలని కోరారు. ఉన్నత చదువులు బీఎడ్ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తారని తెలిపారు. గవర్నమెంట్ టీచర్స్ ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని ఆదేశించారు.

జూనియర్ కాలేజ్, మోడల్ స్కూల్స్, గురుకుల స్కూల్స్‌లపై దృష్టి పెడతానని తెలిపారు. నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ తో పాటుగా లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నట్లయితే ఎంపీడీఓలకు సమాచారం ఇవ్వాలని, తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపడతామని తెలిపారు. నియోజకవర్గంలో బెల్ట్ షాప్‌లు, గంజాయి, మత్తుపదార్థాల పై పోలీసులు ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సవిత బుచ్చన్న, బినోల సర్పంచ్ పితాంబర్, ఉప సర్పంచ్ పుట్టి పోశెట్టి, విజయ్, విండో డైరెక్టర్లు, సీఈఓ రమేష్, కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాంచందర్, బలరాజ్ గౌడ్, గోవర్ధన్, బాబు తదితరులు పాల్గొన్నారు.


Similar News